Fake News, Telugu
 

‘పవన్ కళ్యాణ్ పుట్టినరోజు చందాల పేరిట చోరీకి ప్లాన్’ అనే వార్తను Ntv ప్రచురించలేదు

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు పేరు మీద చందాలు అడగటానికి వచ్చి దొంగతనాలు చేస్తున్నారు అని ‘NTv’ వార్తాసంస్థ ప్రచురించినట్టుగా ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘పవన్ కళ్యాణ్ పుట్టినరోజు చందాల పేరిట చోరీకి ప్లాన్’ అంటూ వార్తను ప్రచురించిన NTv వార్తాసంస్థ.

ఫాక్ట్ (నిజం): ‘గణేష్ చందాల పేరిట చోరీ ప్లాన్’ అని ఉన్న ‘NTV ’ వార్తను ‘పవన్ కళ్యాణ్ పుట్టినరోజు చందాల పేరిట చోరీకి ప్లాన్’ అని ఎడిట్ చేసారు. అసలు ఆ వార్తలో పవన్ కళ్యాణ్ ప్రస్తావనే లేదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లో ఉన్న ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ‘NTv’ వార్తాసంస్థ ప్రచురించిన అసలు ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ ప్రకారం, ‘నిజామాబాద్‌లో వినాయక చందాల పేరుతో సాయికృపానగర్‌లోకి ప్రవేశించారు ఇద్దరు దొంగలు…. అయితే ఒక దొంగ తప్పించుకుని పారిపోగా మరొకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. వినాయక చందాల పేరుతో వచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు’. ఆ ఆర్టికల్ లో పవన కళ్యాణ్ పేరు కానీ, తన అభిమానుల గురించి కానీ ఏమీ రాసి లేదు. అంతేకాదు, ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ లో కూడా ‘గణేష్ చందాల పేరిట చోరీ ప్లాన్…కానీ’ అని టైటిల్ ఉంటుంది. ఆ పోస్ట్ ఫోటో తీసుకొని తమకు నచ్చినట్టుగా ఎడిట్ చేసి ‘NTv’ ప్రచురించినట్టుగా షేర్ చేస్తున్నారు.

చివరగా, ‘గణేష్ చందాల పేరిట చోరీ ప్లాన్’ అని ఉన్న వార్తను ఎడిట్ చేసి ‘పవన్ కళ్యాణ్ పుట్టినరోజు చందాల పేరిట చోరీకి ప్లాన్’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll