Fake News, Telugu
 

పవన్ కళ్యాణ్ గురించి కిమ్ జోంగ్ ఉన్ ఇంటర్వ్యూ లో చెప్పినట్టు వస్తున్న పోస్టుల్లో నిజం లేదు

1

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఉత్తర కొరియా సుప్రీమ్ లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడాడంటూ ఉన్న పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. పోస్ట్ లోని విషయం చూస్తే వ్యంగ్యంగా రాసినట్టు ఉంటుంది. కానీ చాలా మంది దానిని నిజం అనుకొని ఇప్పటికే ఎనిమిది వందలకు పైగా షేర్ చేసారు. అంతే కాదు, ఆ వార్త నిజం అనుకొని పవన్ కళ్యాణ్ ని మెచ్చుకుంటూ కొందరు కామెంట్స్ కూడా పెడుతున్నారు. కొందరేమో ఇది నిజామా? కాదా? అని అడుగుతున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఒక ఇంటర్వ్యూ లో కిమ్ జోంగ్ ఉన్: “నాకు ఇండియాలో తెలిసిన రాజకీయ నాయకులు ఇద్దరే. ఒకళ్ళు ప్రధాని నరేంద్రమోడీ, రెండు జనసేన అధినేత పవన్ కళ్యాణ్”.

ఫాక్ట్ (నిజం): కిమ్ జోంగ్ ఉన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినట్టు వార్తాపత్రికలు కానీ, మీడియా కానీ ఎక్కడా కూడా ప్రచురించలేదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.  

పోస్ట్ చేసిన ఫేస్బుక్ పేజీ ‘Janasena Army’ (@Janasenaarmyy) చేసిన మిగితా పోస్టులు చూస్తే అది జనసేనని వ్యంగ్యంగా మెచ్చుకుంటూ పోస్టులు పెడుతుందని చూడవచ్చు. ఆ పేజీ వారు వ్యంగ్యంగా రాసినా ఫాన్స్ మాత్రం నిజం అనుకొని ఆ పోస్టులను షేర్ చేస్తున్నారు.ఆ పేజీ లోని ఇంకో పోస్ట్ లో చేగువేరా పవన కళ్యాణ్ లా మళ్ళీ పుడుతానని చెప్పినట్టు కూడా ఉంటుంది. అలాంటి ఇంకొన్ని పోస్టులు కూడా ఆ పేజీలో చూడవచ్చు.

ఒక వేల కిమ్ జోంగ్ ఉన్ నిజంగానే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడా అని గూగుల్ లో వెతకగా, అలాంటి ఎటువంటి న్యూస్ ఎవరు కూడా ప్రచురించలేదని తెలుస్తుంది. కావున ఇది కూడా ఆ పేజీ వారు వ్యంగ్యంగా రాసి ప్రజలు నమ్మేల చేస్తున్నారు.

చివరగా, పవన్ కళ్యాణ్ గురించి కిమ్ జోంగ్ ఉన్ ఇంటర్వ్యూ లో చెప్పినట్టు వస్తున్న పోస్టుల్లో నిజం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

1 Comment

scroll