Fake News, Telugu
 

‘నేడు కాశ్మీర్ సెక్రటేరియట్ పై రెపరెపలాడుతున్న మువ్వన్నెల భారత జాతీయ జెండా’ అంటూ పెట్టినది ఒక ఫోటోషాప్ చేయబడిన ఫోటో

0

ఫేస్బుక్ పోస్టులో రెండు ఫోటోలతో కూడిన కొల్లేజ్ ఒకటి పెట్టి, దాంట్లో క్రింద ఉన్న ఫోటో నేడు కాశ్మీర్ సెక్రటేరియట్ పై రెపరెపలాడుతున్న మువ్వన్నెల భారత జాతీయ జెండా అంటూ కొంతమంది పోస్ట్ చేస్తున్నారు. దాంట్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): కొల్లేజ్ లో కాశ్మీర్ సెక్రటేరియట్ పై భారత జాతీయ జెండా ఎగురుతున్న ఫోటో (క్రింద ఉన్న ఫోటో) ఈ రోజుది (జులై 6, 2019).

ఫాక్ట్ (నిజం): కాశ్మీర్ సెక్రటేరియట్ యొక్క పాత ఫోటోని ఫోటోషాప్ ద్వారా అందులో ఉన్న రెండు జెండాలను తీసేసి వాటికి బదులుగా భారత జాతీయ జెండాను (సెంటర్) లో పెట్టి అది ఈ రోజు ఫోటో అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. కావున, పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో నిజం లేదు.      

కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్370 ని రాజ్యసభ రద్దు చేసినప్పటి నుండి ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో చలామణి అవుతున్నాయి. వాటిల్లో ఈ పోస్టు లో ఆరోపించిన విషయం కూడా ఒకటి.

కొల్లేజ్ లో పైన ఉన్న ఫోటోని క్రాప్ చేసి వెతకగా, అది ఇంటర్నెట్ లో గత మూడు సంవత్సరాలుగా చలామణి అవుతున్నట్లుగా ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. వాటిని క్షుణ్ణముగా పరిశీలించినట్లయితే, అవి చూడడానికి ఒకే విధంగా ఉన్నా, కొన్ని ఫోటోల్లో సెక్రటేరియట్ మీద రెండు జెండాలు ఉన్నాయి మరియు ఇంక కొన్ని ఫొటోల్లో సెక్రటేరియట్ మీద ఎటువంటి జెండాలు లేవు. ఆ విషయం మీద స్పష్టత కోసం వెతికినప్పుడు “ANI News” వారు కాశ్మీర్ సెక్రటేరియట్ గురించి ఒక విషయం మీద  ప్రచురించిన కథనం లో మరియు సెక్రటేరియట్ యొక్క గూగుల్ ఫోటో చూసినప్పుడు, సెక్రటేరియట్ మీద రెండు జెండాలు ( ఒకటి భారత జాతీయ జెండా మరియు ఇంకొకటి కాశ్మీర్ రాష్ట్ర జెండా) ఉన్నట్లుగా తెలిసింది.

కొలాజ్లోని రెండు ఫోటోలను పరిశీలించినట్లయితే, పైన ఉన్న ఫోటోని ఎడిటింగ్  పద్ధతి ద్వారా అందులోని రెండు జెండాలను తీసేసి వాటికి బదులుగా భారత జాతీయ జెండాను (సెంటర్) లో పెట్టి  కొలాజ్లో ని క్రింది ఫోటో సృష్టించినట్లుగా నిర్ధారణకు రావొచ్చు.

  1. రెండు ఫొటోల్లో తెల్లని కారుల శ్రేణుల మధ్యలో నల్లటి వాహనాన్ని చూడవచ్చు ( కొల్లేజ్ లో ‘పచ్చటి’ ఇండికేటర్ తో ఉన్నది )
  2. రెండు ఫొటోల్లో ‘ఎరుపు రంగు’ వృత్తంలో అంబాసిడర్ కారు ఒకే స్థానంలో ఉండడం చూడవచ్చు.
  3. రెండు ఫొటోల్లో కూడా ‘పసుపు’ రంగు వృత్తంలో ఎరుపు రంగు తలపాగా తో ఉన్న వ్యక్తిని చూడవచ్చు.

చివరగా, ‘నేడు కాశ్మీర్ సెక్రటేరియట్ పై రెపరెపలాడుతున్న మువ్వన్నెల భారత జాతీయ జెండా’ అంటూ పెట్టినది ఒక ఫోటోషాప్ చేయబడిన ఫోటో

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll