నిజ నిర్ధారణ: సుప్రీమ్ కోర్టు మాయావతిని 5500 కోట్లు చెల్లించమందా?

మిషన్ మోడీ 2019’ అనే ఫేస్బుక్ పేజీ తమ పేజీలో మాయావతి కేసులో వచ్చిన తాజా పరిణామాల మీద ఒక ఫోటో పోస్ట్ చేసారు. ఆ పోస్ట్ లో ఎంత నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

క్లెయిమ్ (దావా): Rs.5500 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసి పెట్టుకున్న తమ విగ్రహాల డబ్బులు తిరిగి ప్రభుత్వానికి చెల్లించమని మాయావతిని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో చెప్పినట్టుగా మాయావతిని సుప్రీమ్ కోర్టు ఎలాంటి జరిమానా కట్టమని ఆదేశించలేదు. కేవలం ప్రయిమా ఫేసీ కింద ఒక అభిప్రాయం మాత్రమే చెప్పారు, ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. తరువాతి హియరింగ్ ఏప్రిల్ 2వ తారికున జరుపుతామన్నారు.

సోర్స్: ANI UP (Twitter)

అదే విధంగా పోస్ట్ లో చెప్పినట్టుగా Rs.5500 కోట్లు అని సుప్రీమ్ కోర్టు ఎలాంటి సంఖ్య ఇవ్వలేదు. విగ్రహాలకు కర్చుపెట్టిన మొతాన్ని కట్టడానికి తయారుగా ఉండాలి అని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎన్డిటీవి న్యూస్ చానెల్ తో మాట్లాడుతూ పిటిషనర్ మరియు లాయర్ రవికాంత్ గారు విగ్రహాలకు మొదట్లో Rs.2600 కోట్లు అయింది కానీ అది తరువాత Rs.4000 కోట్లకు (భూమి కర్చు కాకుండా) పెరిగిందని అన్నారు. మాయావతి ప్రభుత్వం విగ్రహాల నిర్మాణానికి ఎంత ఖర్చు అయిందో ఎక్కడా చెప్పలేదు. ఒక్కప్పుడు సమాజ్వాది పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ విగ్రహాల నిర్మాణంలో Rs.40,000 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని అన్నారు. కావున ఎంత తిరిగి ఇవ్వాలనే విషయంలో స్పష్టత లేదు.

చివరగా, పోస్ట్ లో చెప్పిన రెండు విషయాల్లో కొంత నిజమున్నా అది వక్రికరించబడినది.