Fake News, Telugu
 

తెలంగాణ ఆశా వర్కర్లు ఉన్న పోస్టర్ ని జగన్ నిజంగానే తన అకౌంట్ లో పోస్ట్ చేసాడు

0

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన ఫేస్బుక్ అకౌంట్ లో ఆశా వర్కర్ల గురించి పెట్టిన పోస్ట్ లో తెలంగాణ ఆశా వర్కర్ల ఫోటో కాపీ కొట్టాడు అంటూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్ల జీతాలను పెంచినట్టు జగన్ పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ లో తెలంగాణ ఆశా వర్కర్ల ఫోటో పెట్టాడు.

ఫాక్ట్ (నిజం): జగన్ ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ మరియు తెలంగాణ CMO ట్విట్టర్ లో పెట్టిన ట్వీట్ చూస్తే రెండిట్లో ఫోటోలు మ్యాచ్ అవుతాయి. కావున పోస్ట్ లో చెప్పింది నిజం.

జగన్ పెట్టిన పోస్ట్ కోసం తన అధికారిక ఫేస్బుక్ అకౌంట్ చూడగా తను నిజంగానే పోస్ట్ లో ఉన్న ఫేస్బుక్ పోస్ట్ పెట్టినట్టు చూడొచ్చు. జగన్ పెట్టిన పోస్ట్ లో ఆశా వర్కర్ల ఫోటో ఉంటుంది.

తెలంగాణ CMO ట్వీట్ కోసం ట్విట్టర్ అడ్వాన్స్డ్ సెర్చ్ లో ‘5 May 2017’ డేట్ ఫిల్టర్ పెట్టి వెతకగా, పోస్ట్ లో ఉన్న ట్వీట్ వస్తుంది. ఆ ట్వీట్ లో ఉన్న ఆశా వర్కర్ల ఫోటోనే తిప్పి జగన్ తన ఫేస్బుక్ పోస్ట్ లో పెట్టినట్టు చూడొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది నిజమే.

చివరగా, జగన్ నిజంగానే తెలంగాణ ఆశా వర్కర్లు ఉన్న పోస్టర్ ని తన అకౌంట్ లో పోస్ట్ చేసాడు.

ఎలక్షన్ కౌంటింగ్ ఎట్లా జరుగుతుందో మీకు తెలుసా? ఈ వీడియో చుడండి

Share.

About Author

Comments are closed.

scroll