Fake News, Telugu
 

తెరాస MLA హరీష్ రావు బీజేపీ లో చేరడం లేదు. అది ఒక ఏప్రిల్ ఫూల్ ప్రాంక్

0

టీఆర్ఎస్ ఎం.ఎల్.ఏ హరీష్ రావు బీజేపీ లో చేరబోతున్నారు అంటూ ఫేస్బుక్ లో చాలా మంది ఒక వార్త పత్రిక ఆర్టికల్ ఫోటోని షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): తెరాస MLA హరీష్ రావు బీజేపీ లో చేరబోతున్నారు.

ఫాక్ట్ (నిజం): ఆర్టికల్ చివర్లో ‘ఈ రోజు ఏప్రిల్ ఫూల్స్ డే’ అని ఉంటుంది. హరీష్ రావు కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా డెక్కన్ క్రానికల్ ప్రచురించిన వార్తలో ఎలాంటి నిజం లేదని ట్వీట్ చేసారు.

పోస్ట్ చేసిన ఫోటో లో డెక్కన్ క్రానికల్ ఆర్టికల్ అని చూడొచ్చు. గూగుల్ లో ‘Harish Rao set to join BJP’ అని సెర్చ్ చేస్తే డెక్కన్ క్రానికల్ ఆర్టికల్ వస్తుంది. ఆ ఆర్టికల్ పూర్తిగా చదివితే చివర్లో ‘ఈ రోజు ఏప్రిల్ ఫూల్స్ డే’ అని ఉంటుంది. కావున ఆర్టికల్ ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఒక ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ మాత్రమే.

అంతే కాకుండా హరీష్ రావు స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ వార్త పై స్పందించారు. డెక్కన్ క్రానికల్ ప్రచురించిన వార్త ఫేక్ న్యూస్ అంటూ తనకు క్షమాపణ చెప్పాలి అని ట్వీట్ చేసారు.

చివరగా, తెరాస MLA హరీష్ రావు బీజేపీ లో చేరడం లేదు. అది ఒక ఏప్రిల్ ఫూల్ ప్రాంక్.

Share.

About Author

Comments are closed.

scroll