తాజాగా బలూచిస్తాన్ లో పాక్ సైనికు‌లను తరలిస్తున్న రైలుపై విరుచుకుపడిన రెబల్స్ అంటూ పెట్టిన పోస్ట్ లో నిజం లేదు

ఫేస్బుక్ లో ‘#Breaking బలూచిస్తాన్ లో పాక్ సైనికు‌లను తరలిస్తున్న రైలుపై విరుచుకుపడిన రెబల్స్ . పాక్ సైనికులకు భారీగా ప్రాణ నష్టం..(పూర్తి వివరాలు అందవలసి ఉంది)’ అంటూ రెండు ఫోటోలతో కూడిన పోస్ట్  ఒకటి చాలా షేర్ అవుతోంది . ఈ పోస్ట్ లో ఎంత నిజం ఉందో ఓసారి  విశ్లేషిద్దాం .

క్లెయిమ్ (దావా): తాజాగా బలూచిస్తాన్ లో పాక్ సైనికు‌లను తరలిస్తున్న రైలుపై అక్కడి రెబల్స్ విరుచుకుపడ్డారు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో పెట్టినవి బలోచిస్తాన్ లో 2016 మరియు 2013 లో జరిగిన వేరు వేరు సంఘటనలకు సంబంధించిన  ఫోటోలు . కావున తాజాగా బలూచిస్తాన్ లో పాక్ సైనికు‌లను తరలిస్తున్న రైలుపై అక్కడి రెబల్స్ విరుచుకుపడ్డారు అంటూ పెట్టిన పోస్ట్ లో ఆరోపించినవి అవాస్తవాలు.

 

పోస్ట్ లో పెట్టిన  మొదటి చిత్రాన్ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఆ ఫోటో 8 అక్టోబర్ 2016న  బలోచిస్తాన్ వేర్పాటు వాదులు ప్యాసెంజర్ ట్రైన్ ని పేల్చిన ఘటనకి సంబంధించినదిగా లభించింది.ఈ ఘటన లో  ఆరుగురు చనిపోయారు మరియు 19 మంది గాయపడ్డారు అని Al Jazeera అనే వార్తా సంస్థ ఒక కథనం కూడా ప్రచురించింది.రెండవ ఫోటో ని కూడా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు IGFC అనే ట్విట్టర్ అకౌంట్లో 21 అక్టోబర్ 2013 న పెట్టిన ఇదే ఫోటో లభించింది.

చివరగా, పోస్ట్ లో తాజాగా బలూచిస్తాన్ లో పాక్ సైనికు‌లను తరలిస్తున్న రైలుపై అక్కడి రెబల్స్ విరుచుకుపడ్డారు అంటూ పెట్టిన పోస్ట్ అవాస్తవం.