ఢిల్లీ మెట్రో స్టేషన్ లోని ఒక ఆత్మహత్య వీడియోని తీసుకొని ‘హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో యువకుడి ఆత్మహత్య’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

ఒక యువకుడు మెట్రో స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుంటున్న వీడియో ని పోస్టు చేసి ‘హైదరాబాద్ లింగంపల్లి మెట్రో స్టేషన్ లో ఒక యువకుడి దారుణ ఆత్మహత్య ఏంటి అనే వివరాలు ఇంకా తెలియలేదు జిఆర్పి పోలీసు వాళ్ళు అబ్జర్వేషన్ విచారణ జరుగుతుంది’ అని ఆరోపిస్తున్నారు. ఆ పోస్ట్ లో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వీడియో హైదరాబాద్ లింగంపల్లి మెట్రో స్టేషన్ లో ఒక యువకుడి ఆత్మహత్య కి సంబంధించినది.  

ఫాక్ట్ (నిజం): వీడియో ఢిల్లీలోని ఠాగోర్ గార్డెన్ మెట్రో స్టేషన్ లో ఒక యువకుడి ఆత్మహత్య కి సంబంధించినది.  కావున, పోస్ట్ లో పేర్కొన్న విషయం అబద్ధం. అంతే కాదు, అసలు లింగంపల్లి లో మెట్రో స్టేషన్ లేదు.

యూట్యూబ్ లో “Metro station youth suicide” అనే కీవర్డ్స్ తో వెతికినప్పుడు, సెర్చ్ రిజల్ట్స్ లో  “ETV Telangana” వారు ఆ వీడియో ఆధారంగా ఆగష్టు 21, 2019 న ప్రసారం చేసిన న్యూస్ వీడియో లభించింది. దాని ద్వారా ఆ వీడియో ఢిల్లీలోని ఠాగోర్ గార్డెన్ మెట్రో స్టేషన్ లో ఒక యువకుడి ఆత్మహత్య కి సంబంధించినది అని తెలిసింది.

ఆ ఘటన గురించి “India Today” వారు ఆగష్టు 17, 2019 న ప్రచురించిన వార్తా కథనం ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఢిల్లీ మెట్రో స్టేషన్ లో ఒక ఆత్మహత్య ఘటనకి సంబంధించిన వీడియోని హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో యువకుడి ఆత్మహత్య అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?