“జంతువుల్ని వధిస్తున్నారని ముస్లింలను అసహ్యించుకునే ట్వీట్ లను నేను ఆమోదించను” అంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యలు చేయలేదు

ఈద్ సందర్భంగా ముస్లింలు జంతువులను వధించడాన్ని సమర్ధిస్తూ బిల్ గేట్స్ వ్యాఖ్యలు చేసినట్టు ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : బిల్ గేట్స్: “జంతువుల్ని వధిస్తున్నారని ముస్లింలను అసహ్యించుకునే ట్వీట్ లను నేను ఆమోదించను. కే.ఎఫ్.సీ, మెక్ డొనాల్డ్స్, బర్గర్ కింగ్ వంటి సంస్థలు ప్రతీ రోజూ ఒక మిలియన్ జంతువుల్ని కేవలం ధనవంతుల కోసం వధించి, డబ్బు కూడబెట్టుకుంటున్నాయి. ఈద్ సందర్భంగా ముస్లింలు జిబహ్ చేసే జంతువుల మాంసం పేదలకు ఉచితంగా పంచబడుతుంది అనే వాస్తవం మీరు తెలుసుకోవాలి.”       

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని వ్యాఖ్యలను బిల్ గేట్స్ చేయలేదు. బిల్ గేట్స్ అన్నట్టుగా ఉన్న ఒక ఫేక్ ట్వీట్ ఫోటో నుండి ఆ వ్యాఖ్యలు తీసుకోబడ్డాయి. ఇవే వ్యాఖ్యలు వేరే వాళ్ళు తమ ట్విట్టర్ అకౌంట్ లో పెట్టినట్టు కూడా చూడవచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, అసలు బిల్ గేట్స్ ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా ఎక్కడ కూడా సమాచారం దొరకలేదు. కానీ, పోస్ట్ లోని వ్యాఖ్యలను బిల్ గేట్స్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసినట్టు ఒక ఫోటో సోషల్ మీడియా వైరల్ అవుతునట్టు తెలుస్తుంది. ఆ ఫోటో లోని ట్వీట్ ని బిల్ గేట్స్ ట్వీట్ చేయలేదని, అది ఒక ఫేక్ ట్వీట్ అని ఇంతకుముందే ఇంగ్లీషు లో FACTLY రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చదవచ్చు.

అంతేకాదు, పోస్ట్ లోని వ్యాఖ్యలనే చాలా మంది తమ ట్విట్టర్ అకౌంట్లల్లో బిల్ గేట్స్ ప్రస్తావన లేకుండా ట్వీట్ చేసినట్టు చూడవచ్చు.

చివరగా, “జంతువుల్ని వధిస్తున్నారని ముస్లింలను అసహ్యించుకునే ట్వీట్ లను నేను ఆమోదించను….” అంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యలు చేయలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?