Fake News, Telugu
 

చంద్రబాబు నాయుడు తను రాజకీయాలు వదిలేస్తున్నట్టుగా ఎటువంటి వీడియో పెట్టలేదు

0

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల నుండి నిష్క్రమిస్తున్నట్టు ఒక వీడియోని రిలీజ్ చేసారని ఫేస్బుక్ లో చాలా మంది ఒక పోస్ట్ ని షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): చంద్రబాబు నాయుడు: “ఇవే నా చివరి ఎన్నికలు. మరి, ఉంటాను.”

ఫాక్ట్ (నిజం): చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా విడుదల చేసిన ఒక వీడియో లోని ఆడియోని మార్చారు. తను రాజకీయాలు వదిలేస్తున్నట్టుగా ఎటువంటి వీడియో పెట్టలేదు. కావున పోస్ట్ లోని వీడియో లో చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు రాజకీయాలు వదిలేయట్లేదు.  

పోస్ట్ లోని వీడియోని ఇన్విడ్ సాఫ్ట్ వేర్ సహాయంతో ఫ్రేమ్స్ గా విభజించి, వాటిని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే సెర్చ్ రిజల్ట్స్ లో అసలైన వీడియో వస్తుంది.

వీడియో చూస్తే చంద్రబాబు నాయుడు తను రైతులకు ఇచ్చిన ఋణ మాఫీ గురించి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కావున చంద్రబాబు నాయుడు  రాజకీయాలనుండి నిష్క్రమిస్తున్నట్టుగా ఫేస్బుక్ లో వైరల్ అవుతున్న వీడియో లో ఎటువంటి నిజం లేదు.

ఇది కామెడీ వీడియో అని కొంత మంది భావించినా కూడా, పోస్ట్ పెట్టిన వాళ్ళు ఎక్కడా కూడా డిస్క్లైమర్ పెట్టలేదు. చంద్రబాబు నాయుడు తను రాజకీయాలు వదిలేస్తున్నట్టుగా ఎటువంటి వీడియో పెట్టలేదు. అది ఒక ఎడిటెడ్/మొర్ఫెడ్ వీడియో.

Share.

About Author

Comments are closed.

scroll