Fake News, Telugu
 

చంద్రబాబు ఆరోగ్యం క్షీణించిందని తప్పుడు హెడ్లైన్ పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

0

చంద్రబాబు ఆరోగ్యం క్షీణించిందని చెప్తూ ఒక ఆర్టికల్ లింక్ ని ఫేస్బుక్ లో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం


ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): క్షీణించిన చంద్రబాబు ఆరోగ్యం. హాస్పిటల్ కి తరలింపు. కుప్పకూలిన లోకేష్.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఇచ్చిన ఆర్టికల్ లింక్ ఓపెన్ చేస్తే చంద్రబాబు కేవలం చెకప్ కి వెళ్లినట్టు ఉంటుంది. 2013 లో చంద్రబాబు నిరాహార దీక్ష చేసి అనారోగ్యం పాలైపోయినప్పుడు తీసిన ఫోటోని ఉపయోగించి తప్పుడు హెడ్లైన్ తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లో ఇచ్చిన ఆర్టికల్ క్లిక్ చేస్తే ఒక యుట్యూబ్ వీడియో ఉంటుంది. ఆ వీడియో చూస్తే దాంట్లో చంద్రబాబు కేవలం హెల్త్ చెకప్ కి వెళ్లినట్టు ఉంటుంది. తప్పుడు హెడ్లైన్ పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాంటి వాటిని ‘క్లిక్ బెయిట్’ అంటారు. కేవలం క్లిక్కుల కోసం ఇలాంటి తప్పుడు హెడ్లైన్స్ పెడుతారు. ఆర్టికల్ కవర్ ఫోటో కూడా 2013 లో చంద్రబాబు నిరాహార దీక్ష చేయడం వల్ల అనారోగ్యం పాలైపోయినప్పుడు తీసినది పెట్టారు

చివరగా, చంద్రబాబు ఆరోగ్యం క్షీణించిందని తప్పుడు హెడ్లైన్ పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఎలక్షన్ కౌంటింగ్ ఎట్లా జరుగుతుందో మీకు తెలుసా? ఈ వీడియో చుడండి

Share.

About Author

Comments are closed.

scroll