‘గుజరాత్ లోని ఒక మసీదులో ఆయుధాలు దొరికాయి’ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు

గుజరాత్ లోని ఒక మసీదులో ఆయుధాలు దొరికాయి అంటూ చాలా మంది ఫేస్బుక్ వినియోగదారులు కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఆ ఆరోపణలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): గుజరాత్ లోని ఒక మసీదులో ఆయుధాలు దొరికాయి.

ఫాక్ట్ (నిజం): పోస్టులో పెట్టిన ఫోటోలు 2016లో గుజరాత్ లోని రాజ్ కోట్ లో అక్రమంగా ఆయుధాలను అమ్ముతున్న ఒక దుకాణాన్ని సీజ్ చేసినప్పటివి. పోస్టులో పేర్కొన్నట్లుగా అవి మసీదులో లభించలేదు. కావున, పోస్టులో చేసిన ఆరోపణల్లో నిజం లేదు.      

పోస్టులో ఉన్న ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అవి “Gujarat Headline” అనే పత్రిక మార్చ్ 5, 2016న ప్రచురించిన ఒక కథనం లో లభించాయి. ఆ కథనం ఆధారంగా, ఆ ఫోటోలు గుజరాత్ లోని రాజ్ కోట్ లో అక్రమంగా ఆయుధాలను అమ్ముతున్న ఒక దుకాణంలో సీజ్ చేసినప్పటివి అని తెలిసింది.

“Gujarat Headline News ” వారు అదే సమాచారంతో పెట్టిన ట్వీట్ లో కూడా పోస్టులో పెట్టిన ఫోటోలను చూడవచ్చు.

మరింత సమాచారం కోసం వెతికినప్పుడు, అదే విషయాన్ని వెల్లడించిన “Times of India” కథనం మరియు “Desi Gujarat” కథనం లభించాయి.

చివరగా, పోస్టులో పెట్టిన ఫోటోలు 2016లో గుజరాత్ లోని రాజ్ కోట్ లో అక్రమంగా ఆయుధాలను అమ్ముతున్న ఒక దుకాణాన్ని సీజ్ చేసినప్పటివి. అవి మసీదులో లభించలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?