కాశ్మీర్ లోని ప్రార్ధనా మందిరాలలో కేంద్ర బలగాలు స్వాధీన పరుచుకున్న ఆయుధాలు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు

కాశ్మీర్ లోని ప్రార్ధనా మందిరాలను కేంద్ర బలగాలు స్వాధీన పరచుకొని సోదాలు జరపగా లభ్యమైన ప్రార్ధనా సామాగ్రి, మరియు ప్రార్ధనకారులు” అంటూ ఫేస్బుక్ లో ప్రస్తుతం చాల మంది షేర్ చేస్తున్నారు. అస్సలు పోలీసులు నిజంగా కాశ్మీర్ లో ఆయుధాలు స్వాధీనం చేసారో లేదో విశ్లేషిద్ధం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): కాశ్మీర్ లోని ప్రార్ధనా మందిరాలలో కేంద్ర బలగాలు స్వాధీన పరుచుకున్న ఆయుధాలు.

ఫాక్ట్ (నిజం): గతంలో వేరు వేరు సందర్భాలలో తీసిన ఫోటోలు అన్ని జత పరిచి కాశ్మీర్ లోని ప్రార్ధనా మందిరాలలో కేంద్ర బలగాలు స్వాధీన పరుచుకున్న ఆయుధాలు అంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు.      

కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్370 ని భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటి నుండి గతం లో షేర్ చేసిన పలు ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో మళ్ళి ఇప్పుడు జరిగినట్టు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. 

ఫోటో 1:

పైన ఉన్న ఫోటో గురించి వెతకగా బిజ్నోర్పో పోలీస్ వారు ఉత్తర్ ప్రదేశ్ లోనే మదర్సాలో తనిఖీ చేసినప్పుడు దొరికిన ఆయుధాలు ఎప్పటిది అని వారి ట్వీట్ ద్వారా తెలిసింది.

ఫోటో 2:

పై ఫోటో సెర్చ్ చేస్తే మార్చ్ 2019లో Tumbir వెబ్సైటు లో అప్లోడ్ చేసినట్టు చూడొచ్చు.

ఫోటో 3:

ఇండియా టుడే వారి ఆర్టికల్ ప్రకారం ఈ ఫోటో పంజాబ్ లో ని కత్తులు తయారు చేసే ఫ్యాక్టరీ కి సంబందించింది అని తెలుస్తుంది.

ఫోటో 4:

ఈ ఫోటో జులై 2019 లో “గుజరాత్ లోని ఒక మసీదులో ఆయుధాలు దొరికాయి” అంటూ ప్రచారం చేస్తే ఫ్యాకల్టీ అవి 2016లో గుజరాత్ లోని రాజ్ కోట్ లో అక్రమంగా ఆయుధాలను అమ్ముతున్న ఒక దుకాణాన్ని సీజ్ చేసినప్పటివి అంటూ అప్పుడే నిర్ధారణ చేసింది.

ఫోటో 5:

ఈ ఫోటో ఉత్తర్ ప్రదేశ్ లోని షామిలి పోలీస్ వారు విదేశీయుల్ని వేరు వేరు మదర్సాల నుంచి అరెస్ట్ చేసినప్పటి సంఘటన ట్వీట్ నుంచి తీసి పెట్టారు.

కావున కాశ్మీర్ లోని ప్రార్ధనా మందిరాలలో కేంద్ర బలగాలు స్వాధీన పరుచుకున్న ఆయుధాలు అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?