కర్ణాటక కుర్రాడు శివు ఉప్పర్ ని ఎవరు చంపలేదు, అది ఆత్మహత్య

ఆవులను తరలిస్తుండగా ఆపాడనే కోపంతో శివ కుమార్ ఉప్పర్ అనే కుర్రాడిని చంపేశారని చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): శివ ఉప్పర్ అనే కుర్రాడు ఆవులను తరలించడం ఆపాడని చంపేశారు.

ఫాక్ట్ (నిజం): శివ ఉప్పర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తనని ఎవరు చంపలేదు. పోస్టుమార్టం రిపోర్ట్ లో కూడా అలానే వచ్చింది. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లోని విషయం కోసం గూగుల్ లో ‘Shiva uppar death’ అని వెతకగా, ఈ ఘటన పై వివిధ వార్తాపత్రికలు ప్రచురించిన ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ‘The News Minute’ ఆర్టికల్ ప్రకారం శివు ఉప్పర్ ది హత్య కాదు, ఆత్మహత్య. శివు ఉప్పర్ కర్ణాటక లోని బెలగావి ప్రాంత APMC యార్డు లో ఉరి వేసుకొని చనిపోయాడని పోస్టుమార్టం రిపోర్ట్ లో కూడా వచ్చినట్టు బీజీపీ ఎం.పీ. సురేష్ అంగడి ట్వీట్ చేసాడని కూడా ఆ ఆర్టికల్ లో చూడొచ్చు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో సురేష్ అంగడి రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అంతే కాదు, శివ కుమార్ ఆత్మహత్యను తప్పుగా ప్రచారం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను బెలగావి పోలీసులు అరెస్ట్ చేసారు.

చివరగా, శివు ఉప్పర్ ని ఎవరు చంపలేదు. అది ఆత్మహత్య.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?