ఎన్నికల కమిషన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తును హెలికాప్టర్ గా మార్చలేదు

కొత్తగా ఎన్నికల కమిషన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ను హెలికాప్టర్ గా మార్చింది అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఎన్నికల కమిషన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ను హెలికాప్టర్ గా మార్చింది.

ఫాక్ట్ (నిజం): ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషన్ వెబ్సైటు చూస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ అని తెలుస్తుంది. కావున ఆ పోస్ట్ లో చెప్పిన విషయం లో నిజం లేదు

కొత్తగా ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ఎన్నికల గుర్తు ఎలికాఫ్టర్ కావున ఎక్కువ సమయం లేదు కాబట్టి సోషల్ మీడియా టీమ్ ఆక్టివ్ గా ఉండి ప్రజ్జలోకి తీసుకు వెళ్ళండి” అంటూ ఫేస్బుక్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ రిలీజ్ చేసినట్టు వాళ్ళ లెటర్ హెడ్ ఒకటి షేర్ చేస్తున్నారు. ఈ లెటర్ ని మనం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి ఫేస్బుక్ అకౌంట్ లో పెట్టిన ఇంకొక లెటర్ తో పోల్చి చూస్తే రెండిటికి గల తేడా గమనించవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషన్ వెబ్సైటు చూసినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ అనే ఉంది.

కొత్తగా ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తులలో ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించి హెలికాప్టర్ గుర్తును ప్రజా శాంతి పార్టీ కి కేటాయించినట్టు తెలుస్తుంది.

చివరగా, ఎన్నికల కమిషన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తును హెలికాప్టర్ గా.మార్చిందంటూ పెట్టిన పోస్టులలో ఎటువంటి నిజం లేదు.