ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం లో తన పై సోషల్ మీడియా లో వస్తున్న చాలా ఆరోపణలలో నిజం లేదు

ప్రముఖ బాలీవుడ్ నటి  ఊర్మిళ మటోండ్కర్ నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి ఆన్లైన్ లో చాలా మంది ఆమె పై అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఒక ఫేస్బుక్ పోస్ట్ లో ఆమె RSS అధినేత మోహన్ భగవత్ మేన కోడలు అని ఆరోపించారు . మరో పోస్ట్ లో ఆమె ఒక ముస్లిం ని పెళ్లి చేసుకునే సమయంలో తన మతం మరియు పేరు మార్చుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు ఎంతవరకు వాస్తవమో ఓసారి విశ్లేషిద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా) 1: ప్రముఖ బాలీవుడ్ నటి  ఊర్మిళ మటోండ్కర్   RSS అధినేత మోహన్ భగవత్ మేన కోడలు

ఫాక్ట్ (నిజం): పైన పేర్కొనిన విషయం గురించి సమాచారానికై  ఊర్మిళ మటోండ్కర్ దంపతులను INDIA TODAY  వార్తా సంస్థ సంప్రదించినప్పుడు వారు తమ పై వస్తున్న ఆరోపణలను తిరస్కరించారు. కావున పోస్ట్ లోని ఆరోపణలు అవాస్తవాలు

క్లెయిమ్ (దావా) 2: ప్రముఖ బాలీవుడ్ నటి  ఊర్మిళ మటోండ్కర్ ఒక ముస్లిం ని పెళ్లి చేసుకునే సమయంలో తన పేరు మరియు మతం మార్చుకున్నారు.

ఫాక్ట్ (నిజం): పైన పేర్కొనిన విషయం గురించి సమాచారానికై  ఊర్మిళ మటోండ్కర్ దంపతులను INDIA TODAY  వార్తా సంస్థ సంప్రదించినప్పుడు వారు తమ పై వస్తున్న ఆరోపణలను తిరస్కరించారు. కావున పోస్ట్ లోని ఆరోపణలు అవాస్తవాలు.

వారిపై  వస్తున్న వార్తల గురించి సమాచారం కొరకు INDIA TODAY  వార్తా సంస్థ వారు   ఊర్మిళ మటోండ్కర్ దంపతులను సంప్రదించినప్పుడు వారు ఈ క్రింది విధంగా స్పందించారుఊర్మిళ గారిని, వారికి  మరియు RSS అధినేత మోహన్ భగవత్ గారికి ఉన్న కుటుంబ సంబంధం పై సమాచారం అడగగా, ఆమె అలా జరుగుతున్న ప్రచారం లో ఎటువంటి వాస్తవం లేదు అని కొట్టిపారేశారు. ఊర్మిళ మటోండ్కర్ గారు వారి పెళ్లి సమయం లో పేరు మరియు మతం మార్పుకి సంబంధించి వస్తున్న వార్తలపై  ఆమె భర్త మొహసిన్ అఖ్తర్ మీర్ గారు స్పందించారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇలాంటి వార్తలు రావడం  సహజం అని, కానీ వీటిల్లో ఎటువంటి నిజం లేదని తెలియజేసారు. పెళ్లి సమయం లో ఊర్మిళ తన పేరు కానీ మతం కానీ మార్చుకోలేదని వివరణ ఇచ్చారు.

చివరగా, ఊర్మిళ మటోండ్కర్ గారు RSS అధినేత మోహన్ భగవత్ మేన కోడలు అని ,ఆమె ఒక ముస్లిం ని పెళ్లి చేసుకునే సమయంలో తన పేరు మరియు మతం మార్చుకున్నారని అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు.