Fake News, Telugu
 

ఈ వీడియో మన దేశ వాయుసేన పాకిస్తాన్ భూభాగం లో చేసిన దాడిది కాదు

0

పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి మరీ భారత వాయు సేన  దెబ్బ కొట్టారు అంటూ ఒక వీడియో ని ‘MISSION MODI 2019’ అనే పేజీ ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు. ఈ ఆర్టికల్ రాసే సమయానికి ఏడు వేల మందికి పైగా ఆ వీడియో ని షేర్ చేసారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఎంత నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం

క్లెయిమ్ (దావా):పోస్ట్ చేసిన వీడియో మన దేశ వాయుసేన పాకిస్థాన్ భూభాగంలో చేసిన దాడిది

ఫాక్ట్ (నిజం):పోస్ట్ చేసింది మన దేశ వాయుసేన పాకిస్థాన్ భూభాగంలో చేసిన దాడిది  కాదు. అది ఒక వీడియో గేమ్ కి సంభందించిన వీడియో. కావున వీడియో లో నిజము లేదు.

పోస్ట్ చేసిన వీడియో ని ఇన్విడ్ సాఫ్ట్ వేర్ సహాయం తో ఫ్రేమ్స్ గా విభజించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే ఒక గేమ్ కి సంభందించిన వీడియో వస్తుంది. ఆ గేమ్ వీడియో టైటిల్స్ కట్ చేసి సర్జికల్ స్త్రయిక్స్ వీడియో అని ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు. య్యూట్యూబ్ లో ‘ Taliban US Apache Simulator’  అని సెర్చ్ చేస్తే కూడా ఫేస్బుక్ లో షేర్ అవుతున్న వీడియో వస్తుంది. ఆ వీడియోని 2015 లోనే అప్లోడ్ చేసారు.

చివరగా, పోస్ట్ చేసింది మన దేశ వాయుసేన పాకిస్థాన్ భూభాగంలో చేసిన దాడిది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll