ఈ వీడియో మన దేశ మిరాజ్ యుద్ధ విమానాల దాడి వీడియో కాదు. అది చాలా పాత  వీడియో

పి.ఓ.కే లో జైషే మొహమ్మద్ ఉగ్రవాద శిక్షణ కేంద్రాల మీద భారత యుద్ధ విమానాలు దాడి చేసిన వీడియో అంటూ ఒక వీడియో ని ‘Share Telangana’ అనే పేజీ ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు. ఆ వీడియోని చాలా మంది షేర్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఎంత నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం

క్లెయిమ్ (దావా): పోస్ట్ చేసిన వీడియో మిరాజ్ యుద్ధ విమానాల దాడికి సంభందించింది

ఫాక్ట్ (నిజం): పోస్ట్ చేసింది మిరాజ్ యుద్ధ విమానాల దాడి వీడియో కాదు. అది చాలా పాత  వీడియో. కావున వీడియో లో నిజము లేదు.

య్యూట్యూబ్ లో ‘ Pak F-16 at night’  అని సెర్చ్ చేస్తే ఫేస్బుక్ లో షేర్ అవుతున్న వీడియో వస్తుంది. ఆ వీడియోని 2016 లో అప్లోడ్ చేసారు. కావున అది ఫేస్బుక్ లో షేర్ అవుతున్నట్టుగా మిరాజ్ విమానాలు పాకిస్తాన్ పై చేసిన దాడి యొక్క వీడియో కాదు. పోస్ట్ చేసిన వీడియో లాంటి వీడియో నే వేరే అంగెల్ లో ‘14th August Celebrations F-16 Flypast Islamabad’ అనే టైటిల్ తో య్యూట్యూబ్ లో ఐదేళ్ళ క్రితమే పోస్ట్ చేసారు.

చివరగా, పోస్ట్ చేసింది మిరాజ్ యుద్ధ విమానాల దాడి వీడియో కాదు .