ఇవి చంద్రయాన్ 2 తీసిన భూమి ఫోటోలు కావు

కొన్ని రోజులుగా చంద్రయాన్-2 తీసిన మొట్ట మొదటి భూమి ఫోటోలు అంటూ సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అస్సలు అందులో ఎంత నిజం ఉందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): చంద్రయాన్-2 తీసిన మొట్ట మొదటి భూమి ఫోటో .

ఫాక్ట్ (నిజం) : వేరు వేరు సందర్భాలలో తీసిన ఫోటోలు అన్ని జత పరిచి చంద్రయాన్-2 తీసిన ఫోటోలు అంటూ ప్రచారం చేస్తున్నారు. అసలు ఇందులో ఏ ఒక్క ఫోటో కూడా ఇప్పుడు తీసింది కాదు. కావున పోస్టులో చెప్పింది అబద్ధం.  

అస్సలు చంద్రయాన్-2 తీసిన ఫోటోలు అంటూ ప్రచారం అవుతున్న ఫోటోలు దాని లాంచ్ కంటే ముందు అంటే July 22, 2019 ముందు మనకు ఇంటర్నెట్ లో ఎక్కడన్నా దొరుకుతాయో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూద్దాం.

ఫోటో 1:

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే 2014 లోనే ఈ వెబ్సైటు లో పెట్టినట్టు చూడొచ్చు.

ఫోటో 2:

ఈ ఫోటో అయితే 2009 లో రిలీజ్ అయిన ఇంగ్లీష్ సినిమా ‘Knowing’ పోస్టర్ నుంచి తీసి పెట్టారు.

ఫోటో 3:

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే 6 సంవత్సరాల కిందటే ఈ వెబ్సైటు లో పెట్టినట్టు తెలుసుకోవొచ్చు.

ఫోటో 4:

ఈ చిత్రాన్ని ‘Astronomy Picture of the Day’ అంటూ 2007 లోనే నాసా వాళ్ళు రిలీజ్ చేసారు.

ఫోటో 5:

ఈ ఫోటో 2005 లో నాసా ఫోటో ల్యాబ్ వాళ్ళు తయారు చేసిన అనిమేషన్ వీడియో నుంచి తీసి పెట్టారు.

ఫోటో 6:

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే 2004 లోనే ఈ బ్లాగ్ లో పెట్టినట్టు తెలుస్తుంది.

ఫోటో 7:

ఇది 2014 లో రిలీజ్ అయిన Karac: Kaldar Warriors #1 అనే పుస్తకం యొక్క కవర్ ఫోటో.

ఫోటో 8:

టెలిగ్రాఫ్ సంస్థ వాళ్ళు 2017 లోని వారి ఆర్టికల్ లో ఈ ఫోటో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఆస్ట్రోనౌట్స్ తీసినట్టు తెలిపారు.

ఫోటో 9:

ఈ ఫోటో కూడా నాసా ఫోటో ల్యాబ్ వాళ్ళు తయారు చేసిన ఒక కాన్సెప్టువల్ ఫోటో.

ఫోటో 10:

ఈ ఫోటో ని 2014 లోనే ‘Best Photography’ అనే ఫేస్బుక్ పేజీ పోస్ట్ చేసింది.

ఫోటో 11:

ఈ ఫోటో ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే 2012 లో మొబైల్ ఫోన్ లో వాల్ పేపర్ గా పెట్టుకోటానికి ఈ వెబ్సైటు లో అప్లోడ్ చేసారు.

కావున వివిధ సందర్బాలలో తీసిన ఫొటోలన్నీ కలిపి చంద్రయాన్-2 తీసిన ఫోటోలు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పోస్టుల్లో ఎంత నిజం ఉందో తెలుసువాలంటే మీరు కూడా చాలా సులువుగా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి తెలుసుకోవొచ్చు. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఎలా చేయాలో తెలుసుకోటానికి మా ఈ వీడియో చుడండి.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?