ఇమ్రాన్ ఖాన్ ని ఎవరు కొట్టలేదు. అది 2013 లో జరిగిన ఒక దుర్ఘటన.

పాకిస్తాన్ ప్రధానమంత్రిని కొట్టారు అంటూ ఒక వీడియోని ఫేస్బుక్ లో ‘రాజశేకర్ కట్టర్ హిందూ’ అనే వ్యక్తి పోస్ట్ చేసాడు. ఆ వీడియోలో ఎంత వరకు నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం.

క్లెయిమ్ (దావా): పాకిస్తాన్ లో ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నే కొట్టారు. అలంటి వాళ్లతో శాంతి చర్చలా.

ఫాక్ట్ (నిజం): ఇమ్రాన్ ఖాన్ ని ఎవరు కొట్టలేదు. ఆరేళ్ళ క్రితం తను ప్రధాన మంత్రి కాకముందు ఎలక్షన్ రాలీ లో కింద పడిపోయినప్పుడు తగిలిన గాయాల వీడియో ని ఎడిట్ చేసి ఫేస్బుక్ లో తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

గూగుల్ లో ‘ Imran Khan Injured’ అని సెర్చ్ చేస్తే రిజల్ట్స్ లో య్యూట్యూబ్ వీడియో ఒకటి వస్తుంది. దాని కింద వివరణ చదువుతే ఆ ఘటన 2013 లో ఎలక్షన్ ప్రచారంలో జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ సమయానికి ఇమ్రాన్ ఖాన్ ప్రధాని మంత్రి కూడా అవ్వలేదు. కావున పోస్ట్ లో చెప్పిన దాంట్లో ఎలాంటి నిజం లేదు.

చివరగా, ఇమ్రాన్ ఖాన్ ని ఎవరు కొట్టలేదు. అది 2013 లో జరిగిన ఒక దుర్ఘటన.