Fake News, Telugu
 

ఆ మహిళ రాహుల్ గాంధీతో కాశ్మీర్ విషయంలో మోదీ చేసిన మంచి పనికి ఎందుకు అడ్డుపడుతున్నారని అనలేదు

0

ఒక మహిళ రాహుల్ గాంధీతో ఏడుస్తూ మాట్లాడుతున్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్ట్ చేసి‘విదేశాల్లో ఉండే NRI కాశ్మీరీ ముస్లిం..కాశ్మీర్ విషయంలో మోదీజీ చేసిన మంచిపనికి ఎందుకు అడ్డుపడుతున్నారని చెప్పుతో కొట్టినట్టు అడుగుతూ నువ్వు దేశద్రోహివి అంటూ తిడుతుంటే రాహుల్ గాంధీ మొహం చూడండి ఎలా మాడిపోయిందో’ అని ఆరోపిస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: విదేశాల్లో ఉండే NRI కాశ్మీరీ ముస్లిం రాహుల్ గాంధీని కాశ్మీర్ విషయంలో మోదీ చేసిన మంచి పనికి ఎందుకు అడ్డుపడుతున్నారని అడుగుతూ అతన్ని దేశ ద్రోహి అని అన్నది.

ఫాక్ట్ (నిజం): ఆ మహిళ రాహుల్ గాంధీతో కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం అక్కడ అమలులో ఉన్న నిబంధనల వల్ల తన కుటుంబ సభ్యులు మరియు ఇతర ప్రజలు పడుతున్న కష్టాల గురించి చెప్పింది. అంతేగానీ, పోస్టులో ఆరోపించినట్లుగా రాహుల్ గాంధీని కాశ్మీర్ విషయంలో మోదీ చేసిన పనికి ఎందుకు అడ్డుపడుతున్నారని గానీ, అతన్ని దేశ ద్రోహి అని గానీ ఎక్కడా అనలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టు లో పెట్టిన వీడియోలో కనిపించే మహిళ రాహుల్ గాంధీ తో ఆర్టికల్ 370 రద్దు అనంతరం కాశ్మీర్ లో ఉన్న పరిస్థితుల గురించి ఆయనకు హిందీ లో చెప్పింది. దాని తెలుగు అనువాదం ఈ విధంగా ఉంది- ‘చిన్న పిల్లలను వారి ఇళ్ళ నుండి బయటకు రావడాన్ని అనుమతించట్లేదు. ఒక వేళ వారు తప్పి పోతే వాళ్ళని వెతుకుతూ వెళ్లినవారిని పట్టుకుంటున్నారు. మా అన్నయ్య ఒక హార్ట్ పేషెంట్. తప్పి పోయిన తన పిల్లాడి ఆచూకీ కోసం వెళ్తే అతన్ని పట్టుకున్నారు. పది రోజులైనా కూడా అతను ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనే విషయం చెప్పడం లేదు. మేము అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నాము.’

అంతేగానీ, పోస్టులో ఆరోపించినట్లుగా రాహుల్ గాంధీని కాశ్మీర్ విషయంలో మోదీ చేసిన పనికి ఎందుకు అడ్డుపడుతున్నారని గానీ, దేశ ద్రోహి అని గానీ ఎక్కడా అనలేదు.

రాహుల్ గాంధీకి శ్రీనగర్ నగరంలోకి అనుమతిని నిరాకరణిచడంతో ఢిల్లీకి విమానంలో తిరుగు  ప్రయాణం చేస్తున్నపుడు ఆ సంఘటన జరిగినట్లుగా ‘The Indian Express’ వారు ఆ వీడియోకి సంబంధించి ప్రచురించిన కథనం లో చూడవచ్చు.

చివరగా, ఆ మహిళ రాహుల్ గాంధీతో కాశ్మీర్ విషయంలో మోదీ చేసిన మంచి పనికి ఎందుకు అడ్డుపడుతున్నారని అనలేదు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం అక్కడ నెలకొన్న పరిస్థితులను మరియు వారు అనుభవిస్తున్న బాధలను చెప్పింది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll