Fake News, Telugu
 

ఆ డాన్స్ వీడియో హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణ కార్మికుడికి సంబంధించినది కాదు

0

‘హైదరాబాద్ మైట్రో రైలు కార్మికుడు డాన్స్‌ ఇరగదీశాడు….’ అంటూ కొంత మంది ఫేస్బుక్ లో ఒక వీడియోని పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో ఎంత వరకు నిజముందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): పోస్ట్ లో పెట్టిన వీడియో లో డాన్స్ చేస్తున్నది హైదరాబాద్ మెట్రో రైల్ కార్మికుడు.

ఫాక్ట్ (నిజం): ఆ వీడియో దక్షిణ చైనాలోని సిచువాన్ ప్రావిన్సులో నిర్మాణ పని చేసే కార్మికుడికి సంబంధించినది. కావున పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో నిజం లేదు.

వీడియో యొక్క కామెంట్స్ విభాగంలో చూసినప్పుడు ఒక వ్యక్తి ఆ వీడియో వాస్తవంగా చైనాకి  సంబంధించినది గా పేర్కొన్నాడు.

యూట్యూబ్ లో “Metro dance China” అని వెతికినప్పుడు, వీడియోని చైనాకి చెందిన ‘South China Morning Post’ అనే ఛానల్ అప్లోడ్ చేసినట్లుగా తెలిసింది. ఆ వీడియో క్రింద ఉన్న వివరణని బట్టి అది దక్షిణ చైనాలోని సిచువాన్ ప్రావిన్సులో నిర్మాణ పని చేసే కార్మికుడికి సంబంధించిన డాన్స్ వీడియో అని తెలుస్తుంది. అదే వీడియో ని చాలా మంది ట్విట్టర్ లో మరియు యూట్యూబ్ లో ఫిబ్రవరి 2019 నుంచి పోస్ట్ చేస్తున్నారు.

చివరగా, ఆ డాన్స్ వీడియో హైదరాబాద్ మెట్రో రైల్ కార్మికుడికి సంబంధించినది కాదు. చైనా కి చెందిన నిర్మాణ కార్మికుడిది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll