అసెంబ్లీ లో చిరంజీవి అడిగింది రైతులకు నష్టపరిహారం గురించి, రైతు బంధు లాంటి పెట్టుబడి సహాయం కాదు

టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టిన ‘రైతు బంధు’ లాంటి పథకాన్ని చిరంజీవి తను ఎం.ఎల్.ఏ గా ఉన్నప్పుడే అసెంబ్లీ లో ప్రతిపాదించారని చెప్తూ ఒక వీడియోతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ‘రైతు బంధు’ లాంటి పథకాన్ని పదేళ్ళ క్రితమే అసెంబ్లీ లో ప్రతిపాదించిన చిరంజీవి.

ఫాక్ట్ (నిజం): వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు హెక్టార్ కి పది వేల రూపాయులు నష్ట పరిహారం ఇవ్వడం గురించి వీడియోలో చిరంజీవి మాట్లాడాడు. అంతే కానీ ‘రైతు బంధు’ లాంటి పెట్టుబడి సహాయం గురించి మాట్లాడలేదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.  

పోస్ట్ లోని వీడియో స్క్రీన్ షాట్ ని తీసుకొని గూగుల్ లో వెతకగా,  యూట్యూబ్ లో ‘MLA Chiranjeevi Great speech for Farmers in Assembly’ అనే టైటిల్ తో ఉన్న ఒక వీడియో లింక్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ వీడియోలో నుండే కొంత భాగం తీసుకొని ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు. పూర్తి వీడియో చూస్తే చిరంజీవి వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అడుగుతున్నట్టుగా చూడవచ్చు. యూట్యూబ్ వీడియో లో 1:07 సెకండ్ల దగ్గర ‘విపత్తు’ జరగడం గురించి ప్రస్తావించినట్టు వినొచ్చు. కావున చిరంజీవి ‘రైతు బంధు’ లాంటి సహాయ పెట్టుబడి పథకం గురించి అసెంబ్లీ లో మాట్లాడలేదు.

వీడియో లో చిరంజీవి హెక్టార్ కి పది వేల రూపాయులు నష్టపరిహారం అడిగినట్టు ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ని విమర్శిస్తూ ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మాళ్ళీ హెక్టార్ కి పది వేల రూపాయులు డిమాండ్ చేసినట్టుగా ఎన్డీటీవీ ఆర్టికల్ లో చూడవచ్చు.

చివరగా, అసెంబ్లీ లో చిరంజీవి అడిగింది రైతులకు నష్టపరిహారం గురించి, రైతు బంధు లాంటి పెట్టుబడి సహాయం కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?