అవి ఉగ్రవాదుల మీద భారత ఆర్మీ జరిపిన కాల్పులు కావు, రైఫిల్ స్కోప్ యొక్క రివ్యూ వీడియో

పాకిస్తాన్ నుండి భారత దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ చంపుతున్నట్టుగా ఒక వీడియోని ఫేస్బుక్ లో ‘Best Page బెస్ట్ పేజ్’ అనే పేజీ పోస్ట్ చేసింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఎంత వరకు నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం.

క్లెయిమ్ (దావా): పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశం లోకి చొరబడుతుంటే మన ఇండియన్ ఆర్మీ వాలు పాకిస్తాన్ వాళ్ళను ఎలా చంపుతున్నారో చుడండి.

ఫాక్ట్ (నిజం): అది ఒక స్కోప్ రివ్యూ వీడియో. ‘ACSS Raptor’ అనే రైఫిల్ స్కోప్ యొక్క సామర్ధ్యం చూపెట్టడానికి తీసిన వీడియో.

షేర్ అవుతున్న వీడియో ని ఇన్విడ్ సాఫ్ట్ వేర్ సహాయంతో ఫ్రేమ్స్ గా విభజించి గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే రిజల్ట్స్ లో య్యూట్యూబ్ వీడియో ఒకటి వస్తుంది. దాని కింద వివరణ చదువుతే అది రైఫిల్ స్కోప్ యొక్క రివ్యూ వీడియో అని తెలుస్తుంది. ఆ వీడియో యొక్క టైం స్టాంప్ చూస్తే వీడియోని 2018 లో అప్లోడ్ చేసినట్టుగా తెలుస్తుంది.

చివరగా, పోస్ట్ లో ఎలాంటి వాస్తవం లేదు. అది రైఫిల్ స్కోప్ యొక్క స్కోప్ రివ్యూ వీడియో.