Fake News, Telugu
 

అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు ప్రజల అభిప్రాయం కొరకు ఎటువంటి ఆన్లైన్ పోల్ నిర్వహించట్లేదు

0

అయోధ్య లో రామ మందిరం మరియు బాబ్రీ మసీదు పై జరిగిన గొడవల గురించి అందరికి తెలిసిందే. కొన్ని ఏళ్ళగా కోర్టులో ఈ విషయంపై కేసు నడుస్తుంది. కానీ ఇప్పుడు ఆ స్థలంపై ఏది నిర్మించాలి అనే నిర్ణయం కోర్టు ప్రజలకే ఇచ్చింది అంటూ ఒక వెబ్ లింక్ తో కూడిన మెసేజ్ ని కొందరు ఫేస్బుక్ మరియు వాట్స్ ఆప్ లో షేర్ చేస్తున్నారు. ఆ మెసేజ్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): అయోధ్య రాం మందిరం మరియు బాబ్రీ మసీదు పై ఆన్లైన్ ఓటింగ్ జరుగుతుంది. భారతదేశ సుప్రీం కోర్టు ఈ నిర్ణయాన్ని పౌరులకు అప్పగించింది.

ఫాక్ట్ (నిజం): సుప్రీం కోర్టు అయోధ్య మందిరం-మసీదు భూమి కేసులో ఎటువంటి ఆన్లైన్ పోల్ నిర్వహించట్లేదు. పోస్ట్ లో ఇచ్చిన లింక్ ఓక ఫేక్ పోల్. కావున పోస్ట్ లో చెప్పిన విషయాల్లో నిజం లేదు.

పోస్ట్ లో ఇచ్చిన లింక క్లిక్ చేస్తే నిజంగానే ఒక పోల్ ఉన్న వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. కానీ ఆ పేజీ వెబ్ అడ్రస్ మరియు వెబ్ పేజీ మొత్తం చూస్తే ప్రభుత్వ వెబ్ సైట్ లాగా కనిపించదు. కావున గూగుల్ లో అయోధ్య విషయం పై ఆన్లైన్ పోల్ గురించి వెతకగా అలాంటి ఎటువంటి పోల్ ని సుప్రీమ్ కోర్టు నిర్వహించట్లేదని తెలుస్తుంది.  ఈ విషయం పై 2017 లోనే ఇండియా టుడే రాసిన ఆర్టికల్ కూడా సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. పోస్ట్ లో ఇచ్చిన వెబ్ సైటే కాకుండా ఇంకా చాలా ఫేక్ పోల్స్ ఉన్నట్టుగా ఆ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. కావున పోస్ట్ లో ఇచ్చిన పోల్ సుప్రీమ్ కోర్టు నిర్వహించట్లేదు.

తాజా సమాచారం ప్రకారం, అయోధ్య మందిరం-మసీదు కేసు మీద సుప్రీం కోర్టు మధ్యవర్తిత్వం చేయడానికి ఒక కమిటీ వేసారు. ఆగష్టు 15, 2019 వరకు ఆ కమిటీకి టైం ఇచ్చారు.

చివరగా, అయోధ్య కేసుపై సుప్రీమ్ కోర్టు ప్రజల అభిప్రాయం కొరకు ఎటువంటి ఆన్లైన్ పోల్ నిర్వహించట్లేదు. అది ఒక ఫేక్ న్యూస్.

ప్రతి వారం, మేము ‘ఏది ఫేక్, ఏది నిజం’ అనే తెలుగు యూట్యూబ్ షో చేస్తున్నాం. మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll