అయోధ్యలో రామ మందిరం కట్టాలని ఒక అరబ్ సుష్మా స్వరాజ్ ముందు పాట పాడలేదు

అయోధ్య లో రామ మందిరం కట్టాలని సుష్మా స్వరాజ్ ముందు పాట పాడిన ఒక అరబ్ అంటూ ఒక వీడియోని ఫేస్బుక్ లో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : అయోధ్యలో రామ మందిరం కట్టాలని ఒక అరబ్ సుష్మా స్వరాజ్ ముందు పాట పాడాడు.

ఫాక్ట్ (నిజం): ‘ANI News’ వారు యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఒరిజినల్ వీడియో చూస్తే వీడియోలోని అరబ్ ‘వైష్ణవ జనతో’ పాట పాడినట్టు తెలుస్తుంది. కావున పోస్ట్ లో ఉన్నది ఒక ఎడిటెడ్ వీడియో.    

పోస్ట్ లో ఇచ్చిన విషయం గురించి గూగుల్ లో ‘Arab singing before Sushma Swaraj’ అని వెతకగా, ‘ANI News’ వారు యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ వీడియో చూస్తే వీడియోలోని అరబ్ వ్యక్తి ‘వైష్ణవ జనతో’ పాట పాడినట్టు వినొచ్చు. కావున, ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన వీడియో ఒక ఎడిటెడ్ వీడియో.

చివరగా, అయోధ్యలో రామ మందిరం కట్టాలని ఒక అరబ్ సుష్మా స్వరాజ్ ముందు పాట పాడలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?