అది 1591 లో తీసిన చార్మినార్ ఫోటో కాదు, ఎడిట్ చేసిన ఫోటో

చార్మినార్ కడుతున్నప్పుడు తీసిన ఫోటో అని ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ ఫోటో లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): పోస్ట్ లో ఉన్నది 1591 లో చార్మినార్ కడుతున్నప్పటి దృశ్యం.

ఫాక్ట్ (నిజం): 1591 లో అసలు కెమెరానే లేదు. పోస్ట్ లో ఉన్న ఫోటో ఎడిట్ చేయబడింది. 1880 లో ఫలక్ నుమా పాలస్ ని దూరం నుండి తీసిన ఫోటోని ఎడిట్ చేసి చార్మినార్ ని పెట్టారు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లో ఉన్న ఫోటోని క్రాప్ చేసి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే, అది నిజానికి ఫలక్నుమ పాలస్ ఫోటో అని తెలుస్తుంది. బ్రిటిష్ లైబ్రరీ వెబ్ సైట్ లో ఒరిజినల్ ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటో కింద వివరణ చూస్తే ఆ ఫోటో 1880 లో తీసారని తెలుస్తుంది, పోస్ట్ లో చెప్పినట్టు 1591లో కాదు. అలానే ఒరిజినల్ ఫోటో చూస్తే ఫోటో లో చార్మినార్ ఉండదు. ఎడిట్ చేసి చార్మినార్ ని పెట్టారు.

చివరగా, 1880 లో తీసిన ఫలక్ నుమా ప్యాలస్ ఫోటోలో చార్మినార్ ని పెట్టారు. అది ఒక ఎడిటెడ్ ఫోటో.