Fake News, Telugu
 

వివేకానంద రెడ్డి హత్య కేసులో టీడీపీ పార్టీ వాళ్ళ కుట్ర ఉందని NIA బృందం వెల్లడించలేదు

0

వివేకానంద రెడ్డి హత్య కేసులో టీడీపీ పార్టీ వాళ్ళ కుట్ర ఉందని NIA బృందం వెల్లడించిందంటూ కొంతమంది ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో చేసిన ఆరోపణలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): వివేకానంద రెడ్డి హత్య కేసులో టీడీపీ పార్టీ వాళ్ళ కుట్ర ఉందని NIA బృందం వెల్లడించింది. 

ఫాక్ట్ (నిజం): నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కేవలం ఉగ్రవాద కార్యకలాపాలు మరియు సంఘటనలకు సంబంధించిన కేసులను మాత్రమే దర్యాప్తు చేస్తుంది. ఆ సంస్థ వైయస్ఆర్సీపి నేత వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేయడం మరియు అందులో టీడీపీ పార్టీ వాళ్ళ కుట్ర ఉందని వెల్లడించడం అనేవి అవాస్తవాలు.    

వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి వెతికినప్పుడు, ఆ కేసుని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (SIT) కి అప్పగించినట్లుగా “Times of India” కథనం ద్వారా తెలిసింది. పోలీసులు మొదట ఆ కేసుని సెక్షన్ 174 Cr P C ( అసహజ మరణం) క్రింద నమోదు చేశారనీ, పోస్టుమొర్టం అనంతరం దానిని సెక్షన్ 302 IPC (మర్డర్) కి మార్చారని ఆ కథనం ద్వారా తెలిసింది.

ఫేస్బుక్ పోస్టులో ఆరోపించినట్లుగా NIA వారు ఆ కేసుని దర్యాప్తునకు తీసుకున్నారా అని NIA వారి అధికారిక వెబ్సైటులో చూసినప్పుడు, ఆ కేసుకి సంబంధించిన వివరాలేవీ కూడా ఆ సంస్థ కేస్ రిజిస్టర్ లో లభించలేదు. వాస్తవానికి NIA సంస్థ కేవలం ఉగ్రవాద కార్యకలాపాలు మరియు సంఘటనలకు సంబంధించిన కేసులను మాత్రమే దర్యాప్తు చేస్తుంది. ఆ విషయాన్ని ఆ సంస్థ అధికారిక వెబ్సైటు లోని “About Us” విభాగంలో చూడవచ్చు.

చివరగా, వివేకానంద రెడ్డి హత్య కేసును NIA దర్యాప్తు చేయడం మరియు అందులో టీడీపీ పార్టీ వాళ్ళ కుట్ర ఉందని వెల్లడించడం అనేవి అవాస్తవాలు 

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll