బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ అమిత్ షా స్వస్తిక్ మీద నిలబడ్డారంటూ ఒక ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ ఫోటో ఎడిట్ చేయబడింది అంటూ చాలా మంది ఆ పోస్ట్ కింద కామెంట్స్ పెడుతున్నారు. ఆ ఫోటోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): అమిత్ షా స్వస్తిక్ చిహ్నం మీద నిలబడ్డాడు.
ఫాక్ట్ (నిజం): గత సంవత్సరం (2018) రాజస్తాన్ ఎన్నికల సమయంలో నిర్వహించిన ఒక సభ లో అమిత్ షా నిజంగానే స్వస్తిక్ చిహ్నం మీద నిలబడ్డాడు. పోస్ట్ లో ఉన్న ఫోటోని తనే స్వయంగా తన ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. కావున పోస్ట్ చేసిన ఫోటోని ఎవరు ఎడిట్ చేయలేదు.
పోస్ట్ లో ఉన్న ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, గత సంవత్సరం ఇదే విషయం పై AltNews రాసిన ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో కనపడుతుంది. ఆ ఆర్టికల్ ప్రకారం పోస్ట్ లోని ఫోటోని స్వయంగా అమిత్ షా నే తన ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. ఆ ఫోటోని గత సంవత్సరంలో జరిగిన రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో తీసినట్టుగా తెలుస్తుంది. సభ మీద స్వస్తిక్ చిహ్నం తో ఉన్న స్టూల్ పై నిల్చొని అమిత్ షా ప్రసంగించాడు. అప్పట్లోనే ఈ ఫోటో వివాదాస్పదం కావడంతో ఫోటోని తన అకౌంట్ నుండి తేసేసాడు. ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ ఇక్కడ చూడవచ్చు.
చివరగా, బీజేపి పార్టీ ప్రెసిడెంట్ అమిత్ షా నిజంగానే స్వస్తిక్ చిహ్నం ఉన్న స్టూల్ పై నిల్చొని ప్రసంగించాడు.