Fake News, Telugu
 

పోస్ట్ లోని సంఖ్యలు తప్పు. అమిత్ షా మరియు అనిల్ అంబానీ అధికారిక ఆస్తులు పోస్ట్ లో చెప్పినంతగా పెరగలేదు

0

మోడీ ప్రభుత్వంలో కొందరి ఆస్తులు బాగా పెరిగాయని వృద్ధి రేటు సంఖ్యలతో కూడిన ఒక ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ సంఖ్యలలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): .గత ఐదేళ్ళ మోడీ పాలనలో భారీగా పెరిగిన మోడీ మిత్రుల (అనిల్ అంబానీ, బాబా రాందేవ్, అమిత్ షా, జయ్ షా) ఆస్తులు

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని వ్యక్తుల (అమిత్ షా మరియు అనిల్ అంబానీ) అధికారిక ఆస్తి వివరాలు గత ఐదు సంవత్సరాలలో ఎంత మారిందో పోల్చి చూడగా పోస్ట్ లో చెప్పిన దాంట్లో నిజము లేదని తెలుస్తుంది

అమిత్ షా 2012 లో గుజరాత్ అసెంబ్లీ కి, 2017 లో రాజ్యసభ కి పోటీ చేసారు మరియు 2019 లో లోకసభ కి పోటీ చేస్తున్నారు. అఫిడవిట్ల కోసం ‘myneta.info’ వెబ్ సైట్ చూడగా 2012 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం అమిత్ షా ఆస్తి సుమారు పన్నెండు కోట్లు (12) అని తెలుస్తుంది. తరువాత 2017 ఎన్నికల అఫిడవిట్ చూస్తే తన ఆస్తి సుమారు ముపై నాలుగు కోట్లుగా (34) చూడవచ్చు. తన ఆస్తి 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సుమారు ముపై తొమ్మిది (39) కోట్లు. అంటే ఏడేళ్ళ కాలం లో తన ఆస్తి సుమారు 230 శాతం పెరిగింది. కానీ అది పోస్ట్ లో చెప్పిన 900 శాతం కంటే అది తక్కువ.

అలానే ఫోర్బ్స్ సంస్థ ప్రతి సంవత్సరం విడుదల చేసే భారత ధనవంతుల లిస్టు ప్రకారం అనిల్ అంబానీ ఆస్తులు తగ్గుతూ వస్తున్నాయి. ఫోర్బ్స్ లిస్టు ప్రకారం 2014 లో అంబానీ ఆస్తుల నికర విలువ ఐదు బిలియన్ డాలర్ల విలువ ఉంటే 2019 లో తన ఆస్తి నికర విలువ 1.7 బిలియన్ డాలర్ల కి తగ్గింది. కావున పోస్ట్ లో చెప్పినట్టుగా అంబానీ ఆస్తి 400 శాతం పెరగలేదు.

చివరగా, పోస్ట్ లోని సంఖ్యలు తప్పు. అమిత్ షా మరియు అనిల్ అంబానీ అధికారిక ఆస్తులు పోస్ట్ లో చెప్పినంతగా పెరగలేదు. నిజానికి అనిల్ అంబానీ ఆస్తులు తగ్గాయి, పెరగలేదు.

Share.

About Author

Comments are closed.

scroll