పోస్ట్ లోని ఫోటోలు జమ్మూకాశ్మీర్ లోకి ఆడవాళ్ళ లాగా ప్రవేశించడానికి ప్రయత్నించిన పాకిస్తాన్ ఉగ్రవాదులవి కావు.

ఆడవాళ్ళ లాగా డ్రెస్సులు వేసుకొని భారతదేశంలోకి ప్రవేశించాలనుకొన్న పాకిస్తాన్ ఉగ్రవాదులను జమ్ముకాశ్మీర్ లో భారత జవాన్లు అరెస్ట్ చేసినట్టు చెప్తూ కొన్ని ఫోటోలతో ఉన్న పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): భారత్ లోకి ప్రవేశించడానికి ఆడవాళ్ళ లాగా డ్రెస్సులు వేసుకొని జమ్ముకాశ్మీర్ లో భారత జవాన్లకు చిక్కిన పాకిస్తాన్ ముస్లిం ఉగ్రవదులు.

ఫాక్ట్ (నిజం): ఫోటోల్లో ఉన్నవాళ్ళు మోసుల్ (ఇరాక్ లోని ప్రాంతం) నుండి తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నించిన ISIS ఉగ్రవాదులు, భారతదేశంలోకి ప్రవేశిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులు కారు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.      

పోస్ట్ లోని ఫోటోలను గూగుల్ రివర్స్ ఇమేజ్ లో వెతకగా, అలాంటి ఫొటోలతో ఉన్న చాలా ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ‘Kurdistan 24 English’ అనే వార్తా సంస్థ ఇవే ఫోటోలను 2017 లో ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఫోటోల్లో ఉన్నవారు ఆడవాళ్ళ లాగా డ్రెస్సులు వేసుకొని మోసుల్ (ఇరాక్ లోని ప్రాంతం) నుండి తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నించిన ISIS ఉగ్రవాదులని ట్వీట్ లో రాసి ఉంది.

పోస్ట్ లో ఉన్న చివరి ఫోటో గురించి వార్తా సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థలు ఎక్కడా వివరించలేదు, కానీ అది కూడా మోసుల్ కి సంబంధించినవని ‘Eghtesadnews’ వెబ్ సైట్ లోచూడవచ్చు. ఈ ఫోటోలు 2017 కంటేముందు నుండే ప్రచారంలో ఉన్నాయనీ, వాటికీ మోసుల్ కి సంబంధం ఉండకపోవచ్చని ‘France 24 The Observers’ వారు ఒక ఆర్టికల్ లో రాసారు. కావున, పోస్ట్ లోని ఫోటోలు మోసుల్ కే సంబంధించినవని కచ్చితంగా చెప్పలేము, కానీ కచ్చితంగా జమ్మూకాశ్మీర్ కి సంబంధించినవి మాత్రం కాదు. పోస్ట్ లోని ఫోటోలు జమ్ముకాశ్మీర్ కి సంబంధించినవని ఇంటర్నెట్ లో ఎక్కడా కూడా ఆధారాలు దొరకలేదు.

చివరగా, పోస్ట్ లోని ఫోటోలు జమ్మూకాశ్మీర్ లోకి ఆడవాళ్ళ లాగా ప్రవేశించడానికి ప్రయత్నించిన పాకిస్తాన్ ఉగ్రవాదులవి కావు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?