పవన్ కళ్యాణ్ తిరుమలకి కాలినడకన షూస్ వేసుకొని వెళ్ళలేదు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుమలకి నడిచినప్పుడు షూస్ వేసుకొని వెళ్ళాడు అంటూ ఒక ఫోటోని చాలా మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

పోస్ట్ యొక్క ఆర్చివ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): పవన్ కళ్యాణ్ తిరుమలకి కాలినడకన షూస్ వేసుకొని వెళ్ళాడు.

ఫాక్ట్ (నిజం): పవన్ కళ్యాణ్ షూస్ వేసుకొని నడవలేదు. ఒరిజినల్ ఫోటోని ఫోటోషాప్ చేసి షూస్ పెట్టారు. కావున పోస్ట్ లో ఎటువంటి నిజం లేదు.

పోస్ట్ చేసిన ఫోటో ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా సెర్చ్ రిజల్ట్స్ లో ఒరిజినల్ ఫోటో వస్తుంది. దాంట్లో షూస్ లేకుండా పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా చూడొచ్చు. ఒరిజినల్ ఫోటోని తీసుకొని ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ సహాయంతో షూస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. కావున పోస్ట్ లో పెట్టింది అబద్ధం.

చివరగా, పవన్ తిరుమలకి కాలినడకన వెళ్తూ షూస్ వేసుకోలేదు. అది ఒక ఎడిటెడ్ ఫోటో.