గర్భంతో ఉన్న జింకని చంపిన ఆడ సింహం పక్కకు వెళ్లి పడుకుంది, చనిపోలేదు

ఒక ఆడ సింహం తను ఒక జింకను మరియు జింక గర్భంలో ఉన్న పిల్ల జింకను చంపానని భావించి ప్రాణం విడిచిందని చెప్తూ కొన్ని ఫోటోలతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): జింకను మరియు గర్భంలో ఉన్న పిల్ల జింకను చంపి తప్పు చేసానని ఒక ఆడ సింహం భావించి ప్రాణం విడిచింది. 

ఫాక్ట్ (నిజం): నిజంగా ఆడ సింహం ఏమీ భావించిందో ఎవరు చెప్పలేరు, కానీ పోస్ట్ లో చెప్పినట్టుగా ప్రాణం మాత్రం విడువలేదు. కేవలం పక్కకు వెళ్లి పడుకుంది. కావున పోస్ట్ లో ఆడ సింహం చనిపోయిందని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.     

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో ‘Lioness kills pregnant deer’ అని వెతకగా, 2009 లో ‘Daily Mail’ వారు ఈ విషయం పై రాసిన ఒక ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ ప్రకారం ఈ సంఘటన ‘Madikwe Game Reserve, South Africa’ లో జరిగింది. ఆడ సింహం ఒక జింకను వేటాడింది, కానీ తను ఆ జింక ను తినడానికి ప్రయత్నించగా తన గర్భంలో నుండి ఒక పిల్ల జింక బయటికి వచ్చింది, దాన్ని పక్కన పెట్టి కొద్ది సేపు జింకను తిన్నది, కానీ తను ఏమి చేసిందో అర్థమైన ఆడ సింహం కొద్ది సేపు ఆ పిల్ల జింక ని పట్టుకొని అటూ ఇటూ చూసింది, ఆ పిల్ల జింక ని నేల పై పెట్టి దాని వాసన కూడా చూసింది, చివరకు ఆ ఆడ సింహం జింకను మళ్ళీ తినకుండా పక్కకు వెళ్లి పడుకుందని గెర్రీ అనే రిసర్వ్ రేంజర్ ‘Daily Mail’ వారికి చెప్పాడు. ఇది చాలా విచిత్రమైన సంఘటన అని, అసలు ఎం జరిగిందో అక్కడ ఉన్న వారికి ఎవరికి అర్ధం కాలేదని, కానీ ఈ సంఘటన తనకు చాలా రోజుల వరకు గుర్తు ఉంటుందని గెర్రీ చెప్పాడు. కావున పోస్ట్ లో చెప్పినట్టు ఆడ సింహం చనిపోలేదు.

చివరగా, గర్భంతో ఉన్న జింకని చంపిన ఆడ సింహం పక్కకు వెళ్లి పడుకుంది, చనిపోలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?