కాపాడండి అంటూ కువైట్ నుండి వీడియో పెట్టిన వ్యక్తిని 2017 లోనే భారతదేశానికి తిరిగి తీసుకొని వచ్చారు

కువైట్ లో ఓనర్ల దగ్గర చిక్కుకుపోయిన ఒక వ్యక్తి తనను కాపాడమని పెట్టిన వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. తనను భారతదేశానికి తిరిగి తీసుకొని రావాలని కోరుతున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): వీడియోలో మాట్లాడుతున వ్యక్తి కువైట్ లో ఓనర్ల దగ్గర చాలా కష్టాలు పడుతున్నాడు. గవర్నమెంట్ తనకు హెల్ప్ చేసి భారతదేశానికి తిరిగి తీసుకొని రావాలి.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ చేసిన వీడియోలోని వ్యక్తి నిజంగానే కువైట్ లో తన ఓనర్ల దగ్గర కష్టాలు పడ్డాడు. కానీ అది జరిగింది 2017 లో, ఇప్పుడు కాదు. తను 2017 లోనే భారతదేశానికి తిరిగి వచ్చేసాడు. కావున పాత వీడియో ఇప్పుడు ఫేస్బుక్ లో పెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ చేసిన వీడియోని ఇన్విడ్ సాఫ్ట్ వేర్ సహాయం తో ఫ్రేమ్స్ గా విభజించి, వాటిని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే పోస్ట్ లో ఉన్న వీడియో కి సంభందించిన వేరే వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. వాటిల్లో ఒకటి 10tv ఈ సంఘటన పై ప్రసారం చేసిన వీడియో. దాని ప్రకారం వీడియో లో ఉన్న వ్యక్తి నెల్లూరు కి చెందిన రవి. తను నిజంగానే కువైట్ లో ఓనర్ల దగ్గర చాలా కష్టాలు పడటంతో 2017 లో వీడియో తీసి పెట్టాడు. కానీ అదే సంవత్సరం కువైట్ లోని ‘APNRT (Andhra Pradesh Non-Resident Telugu) Association’ వారి సహాయంతో రవి తిరిగి భారతదేశానికి వచ్చేసాడు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే వీడియోని తిరిగి షేర్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

చివరగా, కాపాడండి అంటూ కువైట్ నుండి వీడియో పెట్టిన వ్యక్తిని 2017 లోనే భారతదేశానికి తిరిగి తీసుకొని వచ్చారు.