“ఇమ్రాన్ ఖాన్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేసిన తక్కువే ” అని జనసేన పార్టీ ప్రెస్ రిలీజ్ లో పేర్కొనలేదు

జనసేన పార్టీ మార్చ్ ఒకటో తారీకున “అభినందన్  తిరిగి రావడం ఆనందదాయకం” అని  ప్రెస్ రిలీజ్  చేసింది. ఆ  ప్రెస్ రిలీజ్ లో  ‘పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేసిన తక్కువే’ అని పేర్కొన్నదంటూ  ఫేస్బుక్ లో చాలా పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో ఎంత నిజం ఉందో విశ్లేషిదాం.

క్లెయిమ్ (దావా): “ఇమ్రాన్ ఖాన్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేసిన తక్కువ” అని జనసేన ప్రెస్ రిలీజ్ లో పేర్కొనడం

ఫాక్ట్ (నిజం): జనసేన వెబ్సైటు కి వెళ్లి ప్రెస్ క్లిక్ చేస్తే మనకి వాళ్ళు పెట్టిన ప్రెస్ రిలీజ్ లు కనిపిస్తాయి. వాటిల్లో మార్చ్ ఒకటో తారీకు రిలీజ్ చేసిన “అభినందన తిరిగి రావడం ఆనందదాయకం” అనే పోస్ట్ కూడా కనిపిస్తుంది. అందులో అస్సలు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కాబట్టి ఫేస్బుక్ లో వైరల్ అవుతున్న పోస్ట్ అబద్ధం. అది ఫోటోషాప్ చేయబడింది.

జనసేన వెబ్సైటు కి వెళ్లి ప్రెస్ క్లిక్ చేస్తే మనకి వాళ్ళు పెట్టిన ప్రెస్ రిలీజ్ పోస్ట్స్ కనిపిస్తాయి. వాటిల్లో మార్చ్ ఒకటో తారీకు రిలీజ్ చేసిన “అభినందన తిరిగి రావడం ఆనందదాయకం” అనే పోస్ట్ కూడా కనిపిస్తుంది. అందులో అస్సలు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఇదే విషయం విషయం జనసేన అధికారిక  ఫేస్బుక్ పేజీ లో వెతికినా మార్చ్ ఒకటో పోస్ట్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావన లేకుండా కనిపిస్తుంది. కావున ప్రజలని తప్పు దోవ పట్టించడానికి ఫోటోషాప్ చేసి ఇటువంటి పోస్ట్స్ పెట్టినట్టు నిర్దారణకు రావొచ్చు.

చివరిగా, ఫేస్బుక్ లో వైరల్ అవుతున్న ‘ఇమ్రాన్ ఖాన్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేసిన తక్కువే’ అనే పోస్ట్ లో ఎలాంటి నిజం లేదు.