“కాశ్మీర్ భారతదేశంలో అంతర్బగమే, భారతదేశ ప్రథమ ప్రధాన మంత్రి నెహ్రు తీసుకున్న #ART370వల్లే ఇప్పుడు ఈ సమస్య, భారతదేశం ఒక పిలుపు ఇస్తే పాకిస్తాన్/తివ్రవాదుల ను ఎదుర్కోడానికి మా సైన్యం మొత్తం తరలిస్తం కాశ్మీర్ ని భారతదేశంలో నూటికి నూరుశాతం కలపడానికి” అని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారంటూ ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ : ‘కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే, భారతదేశ ప్రథమ ప్రధాన మంత్రి నెహ్రు తీసుకున్న #ART370 వల్లే ఇప్పుడు ఈ సమస్య, భారతదేశం ఒక పిలుపు ఇస్తే పాకిస్తాన్/తీవ్రవ్రవాదులను ఎదుర్కోడానికి మా సైన్యం మొత్తం తరలిస్తాం కాశ్మీర్ ని భారతదేశంలోనూటికి నూరుశాతం కలపడానికి’ అని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.
ఫాక్ట్ (నిజం): బెంజమిన్ నెతన్యాహు కాశ్మీర్ కి సంబంధించి పోస్టులో ఆరోపించిన వ్యాఖలు చేసినట్లుగా వార్తాపత్రికలు కానీ, మీడియా కానీ ఎక్కడా కూడా ప్రచురించలేదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
బెంజమిన్ నెతన్యాహు కాశ్మీర్ కి సంబంధించి పోస్టులో ఆరోపించిన వ్యాఖలు చేశాడా అని వెతికినప్పుడు, అందుకు సంబంధించిన ఎటువంటి సమాచారం కూడా లభించలేదు. ఒక వేల నెతన్యాహు నిజంగానే అటువంటి వ్యాఖ్యలు చేసినట్లయితే దేశం లోని అన్ని ప్రముఖ వార్తా పత్రికలూ మరియు మీడియా సంస్థలు దాని గురించి ప్రచురించేవి. కానీ, అటువంటి న్యూస్ ఎవరు కూడా ప్రచురించలేదు.
పోస్టులో పెట్టిన నెతన్యాహు ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది 2018లో ముంబై లో జరిగిన ‘షాలోమ్ బాలీవుడ్’ మీట్ అప్పటిది అని తెలిసింది. అందుకు సంబంధించిన “ANI News” వారి కవేరేజ్ చూసినప్పుడు, ఆ ఈవెంట్ లో నెతన్యాహు కాశ్మీర్ కి సంబంధించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు.
చివరగా, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కాశ్మీర్ ని భారతదేశంలో కలపడానికి సంబంధించి ఎప్పుడు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?