ఉగ్రవాదులతో ఫోటోలు దిగే ఆమిర్ ఖాన్ ని హీరోగా ఎందుకు ఆరాధించాలి అని ప్రశ్నిస్తూ ఉన్న ఒక ఫోటోని ‘మిషన్ మోడీ 2019’ అనే ఫేస్బుక్ పేజీ ఒకటి పోస్ట్ చేసింది. ఇప్పటిదాకా ఆ పోస్ట్ ని ఆరు వేల మందికి పైగా షేర్ చేసారు. వైరల్ అవుతున్న ఆ ఫోటోలో నిజం ఎంతుందో విశ్లేషిద్దాం.
క్లెయిమ్ (దావా): అమిర్ ఖాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఫోటో దిగాడు
ఫాక్ట్ (నిజం): 2012 లో ఆమిర్ ఖాన్ హజ్ కి వెళ్ళిన సందర్భంలో దిగిన ఆ ఫోటోలో ఉన్నది ఉగ్రవాదులు కారు. ఆమిర్ కి ఎడమ వైపు ఉన్నది జునైద్ జంషేద్ మరియు కుడి వైపు ఉన్నది తారిక్ జమిల్. వాళ్ళు ఇద్దరు ముస్లిం మత ప్రభోధకులు మరియు పాకిస్తాన్ దేశస్తులు కానీ ఉగ్రవాదులు మాత్రం కారు. జునైద్ జంషెడ్ ఒక ఈవెంట్ లో తన అనుచరులతో మాట్లాడుతూ ఆమిర్ ఖాన్ తో ఎప్పుడు ఎక్కడ ఎలా కలిసారో కూడా వివరించారు.
చివరగా, ఫోటోలో ఆమిర్ తో ఉన్నది ఉగ్రవాదులు కారు.