జపాన్ దేశానికి చెందిన ఒక వ్యక్తి పబ్జి గేమ్‌లో 6ఎక్స్ స్కోప్ ఇవ్వలేదనే కోపంతో అతడి సహ ఆటగాడైన తన మిత్రుడి ప్రాణాలు తీసినందుకు గాను పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో ఎంత వరకు నిజముందో ఓసారి విశ్లేషిద్దాం.
క్లెయిమ్ (దావా): ఫొటోలో ఉన్న వ్యక్తిని పబ్-జి గేమ్‌లో 6ఎక్స్ స్కోప్ ఇవ్వలేదనే కోపంతో అతడి సహ ఆటగాడైన తన మిత్రుడిని చంపినందుకు పోలీసు లు అరెస్ట్ చేశారు.
ఫాక్ట్ (నిజం): ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని 2018 లో చైనా లోని ఒక పాఠశాలలో తొమ్మిది మంది విద్యార్థులను చంపినందుకు గానూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఫోటో ని ఉపయోగించి కొంతమంది అవాస్తవమైన కథనాలతో ప్రక్కద్రోవ పట్టిస్తున్నారు.
పోస్ట్ లో ఉన్న ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా అది “China Daily” అనే వార్తా సంస్థ ప్రచురించిన ఒక కథనం లో లభించింది. దీని ప్రకారం, ఒక వ్యక్తి చైనాలోని పాఠశాలలో తొమ్మిది మంది విద్యార్థులను కత్తితో దాడి చేసి చంపినందుకు గానూ హత్యారోపణలు ఎదురుకుంటున్నందుకు పోలీసులు అతన్ని కోర్ట్ లో హాజరుపరిచారు. పోస్ట్ ఉన్న ఫోటో ఆ సంఘటన కి సంబంధించినది. దీనిని ఉపయోగించి కొంతమంది ఆ వ్యక్తి పబ్-జి గేమ్‌లో 6ఎక్స్ స్కోప్ ఇవ్వలేదనే కోపంతో అతడి సహ ఆటగాడైన తన మిత్రుడిని చంపాడు అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
చివరగా, ఆ ఫొటోలోని వ్యక్తిని చైనా లోని ఒక పాఠశాలలో విద్యార్థులను చంపినందుకుగాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?