స్కూల్ యూనిఫామ్ లో ఉన్న ఒక చిన్న అమ్మాయిని పోల్ కి చైన్ తో బంధించిన ఫోటో ఒక దాన్ని చాలా మంది ఫేస్బుక్ యూజర్స్ పోస్ట్ చేస్తున్నారు. అందులో ఆ అమ్మాయిని అలా బంధించినది ఆమె స్కూల్ వారే అని ఆరోపిస్తున్నారు. అది తెలంగాణ లో జరిగింది అని కూడా ప్రచారం జరుగుతుంది. దానిలో ఎంతవరకు నిజముందో ఓసారి విశ్లేషిద్దాం.
క్లెయిమ్ (దావా): చిన్న అమ్మాయిని చైన్ తో పోల్ కి బంధించినది స్కూల్ యాజమాన్యం
ఫాక్ట్ (నిజం): ఆ అమ్మాయి పాఠశాలకు వెళ్ళనందుకు గాను తన తల్లే అలా బంధించింది. కావున, ఆ అమ్మాయిని అలా బంధించినది స్కూల్ వారు అంటూ ప్రచారం అవుతున్న పోస్ట్ లో నిజం లేదు.
పోస్ట్ లో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది “THE SUN” అనే బ్రిటిష్ వార్తా పత్రిక 2016లో ప్రచురించిన ఒక కథనం లో లభించింది. ఆ ఆర్టికల్ నుండి, ‘ మలేషియా దేశం లోని కౌలాలంపూర్ లో ఒక మహిళ, తన ఎనిమిది ఏళ్ళ కూతురు పాఠశాలకు వెళ్లనందుకు కోపం తో దానికి శిక్షగా వారు ఉండే అపార్టుమెంట్ లోని ఒక స్తంభానికి ఆ అమ్మాయిని చైన్ తో బంధించింది’ అని తెలిసింది. పోస్టులోపెట్టిన ఫొటోలో ఆ అమ్మాయి స్కూల్ యూనిఫామ్ లో ఉన్నందు వల్ల ఆ పని చేసింది ఆమె పాఠశాల వారే అంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇదే కాకుండా, చాలా పత్రికలు కూడా ఈ వార్తని 2016 లో ప్రచురించాయి.
చివరగా, ఆ చిన్న అమ్మాయిని చైన్ తో పోల్ కి బంధించినది ఆమె పాఠశాల వారు కాదు, తన తల్లియే.
ప్రతి వారం, మేము ‘ఏది ఫేక్, ఏది నిజం’ అనే తెలుగు యూట్యూబ్ షో చేస్తున్నాం. మీరు చూసారా?