‘ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించారు’ అని సుప్రీం కోర్ట్ అనలేదు

సుప్రీం కోర్ట్ లో ప్రస్తుతం రామమందిరం-బాబ్రీమసీదు కేసు మీద విచారణ జరుగుతుందన్న విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా, అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించారని సుప్రీం కోర్ట్ చెప్పినట్టుగా ఉన్న పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సుప్రీం కోర్ట్: “ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించారు.”

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని వ్యాఖ్యలను సుప్రీం కోర్ట్ చేయలేదు. ‘Ram Lalla Virajman’ తరపున సుప్రీం కోర్ట్ లో వాదిస్తున్న అడ్వకేట్ ఆ వ్యాఖ్యలను చేసాడు. ఆ వ్యాఖ్యల పై స్పందిస్తూ, ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించినట్టుగా ఆధారాలు ఉంటే చూపెట్టమని సుప్రీం కోర్ట్ వారిని అడిగింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వ్యాఖ్యలు సుప్రీం కోర్ట్ చేసినట్టుగా ఎక్కడా కూడా ఆధారాలు లేవు. కానీ, తాజాగా సుప్రీం కోర్ట్ లో అయోధ్య రామమందిరం కేసుపై జరుగుతున్న వాదోపవాదాల్లో ‘Ram Lalla Virajman’ తరపున సుప్రీం కోర్ట్ లో వాదిస్తున్న అడ్వకేట్ ఆ వ్యాఖ్యలను చేసినట్టుగా ‘Business Standard’ ఆర్టికల్ లో చూడవచ్చు.

ఆ వ్యాఖ్యల పై స్పందిస్తూ, ఒక మందిరాన్ని కూల్చి బాబ్రీ మసీదు కట్టినట్టు ఏమైనా ఆధారాలు ఉంటే కోర్ట్ లో ప్రూవ్ చేయమని, జస్టిస్ చంద్రచూడ్ (కేసు వింటున్న సుప్రీం కోర్ట్ బెంచ్ లో ఒక న్యాయమూర్తి) కోరినట్టు ‘The Hindu’ ఆర్టికల్ లో చదవచ్చు.

చివరగా, ‘ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించారు’ అని సుప్రీం కోర్ట్ అనలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?