అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో (AMU) పుల్వామా దాడులకు నిరసనగా కూడా కొవ్వుతుల ప్రదర్శన నిర్వహించారు

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో  (AMU) న్యూజిలాండ్ లో మసీదు పై దాడికి నిరసనగా కొవ్వుతుల ప్రదర్శన నిర్వహించిన తరువాత, వాళ్ళు పుల్వామా దాడుల తరువాత ఇలాంటి నిరసనలు ఎందుకు చేయలేదు అంటూ చాలా పోస్ట్ లు షేర్ అవుతున్నాయి. ఆ పోస్ట్ లలో ఎంతవరకు నిజం ఉందో ఒక సారి విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో  (AMU) పుల్వామా దాడులకు నిరసనగా కొవ్వుతుల ప్రదర్శన నిర్వహించలేదు కాని న్యూజిలాండ్ లో మసీదు పై దాడికి నిరసనగా మాత్రం నిర్వహించారు.

ఫాక్ట్ (నిజం): అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో (AMU) న్యూజిలాండ్ లో మసీదు పై దాడికి నిరసనగా కొవ్వుతుల ప్రదర్శన నిర్వహించడం నిజమే కానీ, ఒకసారి AMU వాళ్ళకి సంబందించిన ట్విట్టర్ అకౌంట్ చూనట్టయితే వాళ్ళు పుల్వామా దాడులకు నిరసనగా కూడా కొవ్వుతుల ప్రదర్శన నిర్వహించినట్టు తెలుస్తుంది. కావున వాళ్ళకి వెతిరేకంగా పెట్టిన పోస్ట్ లో నిజం లేదు.

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో (AMU) న్యూజిలాండ్ లో మసీదు పై దాడికి నిరసనగా కొవ్వుతుల ప్రదర్శన నిర్వహించిన విషయం చాల చోట్ల ప్రచురితమైంది. అలానే గూగుల్ సెర్చ్ లో వాళ్ళు పుల్వామా దాడులకు వ్యతిరేఖంగా నిరసన ప్రదర్శించారా అని వెతికితే కూడా కొన్ని వీడియో లు మరియు కథనాలు దొరుకుతాయి. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (AMU) ట్విట్టర్ అకౌంట్ లో కూడా వాళ్ళు పుల్వామా దాడులకు వెతిరేకంగా పెట్టిన ట్వీట్ లు ఉన్నాయి.చివరగా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో (AMU) పుల్వామా దాడులకు నిరసనగా కొవ్వుతుల ప్రదర్శన నిర్వహించలేదు అని పెట్టిన పోస్ట్ లో ఎటువంటి నిజం లేదు.